మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ!

  • తొలి నాలుగు రోజులు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో
  • ఆ తర్వాత ములుగు, భద్రాద్రి జిల్లాల్లో పర్యటన
  • పోలీసులకు ఓరియంటేషన్ క్లాసులను బోధించనున్న డీజీపీ
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మావోయిస్టుల ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన వారం రోజుల పాటు కొనసాగనుంది. తొలి నాలుగు రోజులు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఆ తర్వాత ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటన కొనసాగుతుంది.

తన పర్యటనలో పోలీసులకు స్వయంగా ఓరియెంటేషన్ క్లాసులను డీజీపీ బోధించనున్నారు. మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. డీజీపీ స్థాయి వ్యక్తి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుండటాన్ని పలువురు హర్షిస్తున్నారు. పోలీసుల మనోబలాన్ని ఈ పర్యటన పెంచుతుందని అంటున్నారు.


More Telugu News