నయనతార, అమలా పాల్ తిరస్కరించిన పాత్ర.. ఎస్ చెప్పిన త్రిష!
- హిందీ, తమిళ భాషల్లోకి నాని నటించిన 'జెర్సీ'
- హిందీలో షాహిద్ కపూర్, తమిళంలో విష్ణు విశాల్
- బాబుకి తల్లిగా కనిపించే హీరోయిన్ పాత్ర
ఒక భాషలో మంచి హిట్టయిన సినిమాని ఇతర భాషల్లోకి రీమేక్ చేయడం మనం అప్పుడప్పుడు చూస్తూనే వుంటాం. ఆ చిత్రకథ సార్వజనీనం అనిపించినప్పుడు ఇలా పలు భాషల్లో పునర్నిర్మాణం జరుగుతుంటుంది. అలాగే నాని నటించిన ఓ తెలుగు చిత్రం తాజాగా హిందీ, తమిళ భాషల్లోకి రీమేక్ అవుతోంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ఆమధ్య వచ్చిన 'జెర్సీ' చిత్రం మంచి హిట్టయింది. దీంతో హిందీ, తమిళ భాషల్లోకి ఇది రీమేక్ అవుతోంది. హిందీలో ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. ఇక తమిళ వెర్షన్ లో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు.
అయితే, తమిళంలో హీరోయిన్ పాత్ర పోషించడానికి ప్రముఖ తారలు ఎవరూ మొదట్లో ఆసక్తి చూపలేదు. దానికి కారణం, ఇందులో కథానాయిక ఓ బాబుకి తల్లిగా కనపడాలి. దాంతో పాత్ర బాగున్నప్పటికీ.. నయనతార, అమలాపాల్ వంటి హీరోయిన్లు వెనుకంజ వేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ పాత్ర చేయడానికి త్రిష ముందుకు వచ్చినట్టు సమాచారం. ఆమెకు పాత్ర బాగా నచ్చడంతో ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పేసుకుందట.