సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నెగటివ్ షేడ్ పాత్రలో సాయిపల్లవి 
  • అల్లు అర్జున్ 'పుష్ప'కు లాంగ్ షెడ్యూల్
  • జిమ్ లో చెమటోడుస్తున్న నితిన్  
*  ప్రస్తుతం 'టక్ జగదీశ్' చిత్రాన్ని పూర్తిచేస్తున్న హీరో నాని దీని తర్వాత 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని చేయనున్నాడు. ఇందులో కథానాయిక సాయిపల్లవి నెగటివ్ టచ్ తో కూడిన పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. కోల్ కతా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందుకోసం హైదరాబాదులోనే ఆ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేస్తున్నారట.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం షూటింగును అక్టోబర్ నుంచి మహబూబ్ నగర్ అడవుల్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. నలభై రోజుల పాటు నిర్విరామంగా ఈ షెడ్యూలు జరుగుతుందట. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
*  ఇటీవల పెళ్లి చేసుకున్న యంగ్ హీరో నితిన్ ఇప్పుడు మళ్లీ జిమ్ లో వర్కౌట్స్ మొదలెట్టాడు. త్వరలో షూటింగులో జాయిన్ కావాలని భావిస్తున్న నితిన్ ప్రస్తుతం ఫిట్ నెస్ కోసం చెమటోడుస్తున్నాడు. ప్రస్తుతం 'రంగ్ దే' సినిమాలో నటిస్తున్న నితిన్ మరో మూడు కొత్త సినిమాలు కమిట్ అయ్యాడు.    


More Telugu News