చంద్రబాబు, అశోక్ గజపతిరాజులపై మరోసారి విమర్శలు చేసిన సంచయిత
- ఎన్టీఆర్ కు వారసులమని చెప్పుకుంటారని వెల్లడి
- అధికారదాహంతో వెన్నుపోటు పొడుస్తారంటూ వ్యాఖ్యలు
- తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్వీట్
సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్టు బోర్డు చైర్మన్ సంచయిత గజపతి మరోసారి ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజులపై విమర్శనాస్త్రాలు సంధించారు.
"అధికారదాహంతో వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, అశోక్ గజపతిరాజు ఎన్టీఆర్ కు వారసులమని చెప్పుకుంటారు. అదే సమయంలో ఎన్టీఆర్ మహిళలకు ఇచ్చిన చట్టబద్ధమైన హక్కులను మర్చిపోతారు. మాన్సాస్, సింహాచలం ట్రస్టు పగ్గాలు చేపట్టిన తొలి మహిళనైన నాపై తప్పుడు సమాచారాన్ని, అబద్ధాలను ప్రచారం చేస్తారు" అంటూ ట్వీట్ చేశారు. వెన్నుపోటుకు 23 ఏళ్లు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలోనే సంచయిత పై వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సంచయిత... నాడు ఎన్టీ రామారావు అప్పటి అసెంబ్లీ స్పీకర్ కు పంపిన లేఖను కూడా పంచుకున్నారు.