ఎస్పీ బాలు అనారోగ్యంపై భావోద్వేగానికి గురైన రమాప్రభ.. వీడియో ఇదిగో!
- బాలు త్వరగా మన మధ్యకు రావాలి
- మన ప్రార్థనలు ఫలిస్తాయి
- బాలు గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరం
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి జీవితంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రోజులు గడుస్తున్నా ఆయన ఆరోగ్యంలో పురోగతి లేకపోవడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అలనాటి నటి రమాప్రభ స్పందిస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. బాలు త్వరగా కోలుకుని మనందరి మధ్యకు రావాలని ఆకాంక్షించారు. మనందరి ప్రార్థనలు కచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయని చెప్పారు. బాలు గురించి మాట్లాడటం కూడా ఎంతో బాధను కలిగిస్తోందని అన్నారు.