గోదావరి వరద విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్న పవన్

  • పోటెత్తుతున్న గోదావరి
  • భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ
  • ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్న పవన్
  • భౌతిక దూరం అమలు చేయాలని సూచన
గోదావరి క్రమంగా ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఎగువన ఉన్న భద్రాచలంలో ఇప్పటికే మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయిందని, ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారని, అప్పటికే గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు నీట మునిగినట్టు తెలిసిందని, ప్రభుత్వం పునరావాస చర్యలు చేపట్టాలని తెలిపారు.

గోదావరి వరద తీవ్రత ప్రమాదకరస్థాయిలో ఉంటుందని కేంద్ర జలసంఘం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అన్నివిధాలుగా సన్నద్ధం కావాలని పవన్ సూచించారు. ఎలాంటి సహాయ చర్యలు తీసుకున్నా కరోనా దృష్ట్యా భౌతికదూరం మాత్రం పాటించాలని స్పష్టం చేశారు.


More Telugu News