ఏపీలో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి: వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు
- ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు
- తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ వేడుకున్నాడు
- హృదయవిదారకంగా వేడుకుంటున్నా పట్టించుకోవట్లేదు
- శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్లను తక్షణం ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు సరైన వైద్యం అందట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. 'ఏపీలో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి. ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే... ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి? శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్ లను తక్షణం ఆదుకోండి' అని ఆయన కోరారు.
తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదని ఓ యువకుడు చెప్పాడు. తన ఆరోగ్యం విషమిస్తోందని, తన తల్లి జాగ్రత అని అతడు చెప్పాడు. తన రక్తంలో ప్లేట్‌లెట్స్ పడిపోయాయని, వైద్య సిబ్బంది ఆసుపత్రిలోనే ఉన్నప్పటికీ తనకు సరైన చికిత్స అందించట్లేదని అతడు వివరించాడు. ఎంతో బాధపడుతూ అతడు చేసిన ఈ వ్యాఖ్యలు కన్నీరు పెట్టిస్తున్నాయి.