80 వేల కుటుంబాలకే సాయం చేశారు.. మిగిలిన లక్షల మంది పరిస్థితి ఏమిటి?: చంద్రబాబు
- చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
- మూడు నెలల కాలానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలి
- నేతన్నల దగ్గరున్న సరుకును కొనుగోలు చేయాలి
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. నేతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'నేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. చేనేత కుటుంబాలకు రూ.24 వేలు ఇస్తామని చెప్పి కేవలం 80 వేల కుటుంబాలకే ఇస్తే మిగిలిన లక్షల కార్మికుల పరిస్థితి ఏంటి?
లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు మూడు నెలల కాలానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలి. నూలుపై సబ్సిడీ, పావలా వడ్డీ, త్రిఫ్ట్ ఫండ్ బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలి. నేతన్నల దగ్గరున్న సరుకును కొనుగోలు చేయాలి' అని ట్వీట్ చేశారు.