సుశాంత్ ను వేధించిన రియా... బయటకు వచ్చిన కాల్ డేటా!

  • బయటపెట్టిన జాతీయ మీడియా సంస్థ
  • ఐదు రోజుల్లో 25 ఫోన్ కాల్స్
  • తన వద్దకు రావాలని బెదిరింపులు
  • కుటుంబీకులతో మొరపెట్టుకున్న సుశాంత్
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో, అతని ప్రియురాలు రియా చక్రవర్తికి సంబంధించిన కాల్ డేటాను ఓ నేషనల్ మీడియా చానెల్ బయట పెట్టగా, అదిప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. రియా తన ఫోన్ కాల్స్ ద్వారా సుశాంత్ ను మాటలతోనే వేదిన్చినట్టు సదరు చానెల్ ఆరోపించింది. జనవరి 20 నుంచి ఐదు రోజుల వ్యవధిలో రియా ఫోన్ నుంచి సుశాంత్ కు 25 ఫోన్ కాల్స్ వెళ్లాయని, అన్ని సార్లు ఎందుకు ఫోన్ చేసిందన్న విషయంలో అనుమానాలు ఉన్నాయని, ఆ సమయంలో సుశాంత్ తన సోదరితో కలిసి చండీగఢ్ లో ఉన్నారని పేర్కొంది.

తన వద్దకు తిరిగి రావాలని రియా బ్లాక్ మెయిల్ చేసిందని, ఆపై సుశాంత్ ఫోన్ నంబర్ ను మార్చారని ఆ చానెల్ పేర్కొంది. ఆపై తన కుటుంబీకులకు ఫోన్ చేసిన సుశాంత్, రియా ఆగడాలను బయట పెట్టాడని వెల్లడించింది. తనను మెంటల్ హాస్పిటల్ లో చేర్చాలని రియా, తన కుటుంబీకులతో కలిసి ప్రయత్నిస్తోందని, తనకు హాస్పిటల్ లో చేరడం ఇష్టం లేదని చెప్పారని పేర్కొంది. తాను ముంబైని వదిలేసి, హిమాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉండిపోతానని కూడా ఆయన వాపోయాడని పేర్కొంది. 

కాగా, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించగా, అతను ఆత్మహత్య చేసుకున్నారని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, బాలీవుడ్ లో నెపోటిజంపై విమర్శలు వెల్లువెత్తడంతో సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించగా, రియాను నిందితురాలిగా సీబీఐ పేర్కొంటూ అభియోగాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News