కరోనాతో వణుకుతున్న మహారాష్ట్రలో ఒక్క రోజులో 8,706 మంది డిశ్చార్జ్

  • నిన్న కొత్తగా 7,924 మందికి సోకిన కరోనా వైరస్
  • 227 మంది మృతి
  • ముంబైలో తగ్గిన మరణాలు
కొవిడ్‌తో వణుకుతున్న మహారాష్ట్ర వాసులకు ఇది కొంత ఉపశమనం కలిగించే వార్తే. రికార్డు స్థాయిలో నిన్న ఒక్క రోజే 8,706 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, అదే సమయంలో నిన్న 7,924 మంది మహమ్మారి బారినపడ్డారు. అలాగే, 227 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు  3,83,723 కరోనా బాధితులుగా మారగా, 13,883 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.  2,21,944 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 1,47,592 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గతంతో పోలిస్తే ముంబైలో మరణాల సంఖ్య కొంత తగ్గింది. గత 24 గంటల్లో నగరంలో 129 మంది మృతి చెందగా, కరోనా హాట్‌స్పాట్ పూణెలో 52 మంది మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 57.84 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 3.62గా ఉన్నట్టు అధికారులు తెలిపారు.


More Telugu News