డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ 40 మందిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
- 40 మంది నుంచి రూ. 1.50 లక్షల చొప్పున వసూలు
- నిందితుడి నుంచి రూ. 8 లక్షలు, నకిలీ ఇళ్ల పత్రాలు, కారు స్వాధీనం
- గతంలో నకిలీ ఐడీకార్డుతో ఎస్సైగా చలామణి
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. విజన్ వన్ చానల్ ఎండీని అంటూ, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని 40 మందిని మోసం చేశాడు. ఒక్కొక్కరి నుంచి లక్షన్నర రూపాయల చొప్పున వసూలు చేశాడు.
అయితే, డబ్బులు తీసుకున్నప్పటికీ ఇళ్ల ఊసెత్తకపోవడంతో అనుమానించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 8 లక్షల రూపాయల నగదు, నకిలీ ఇళ్ల పత్రాలు, ఐడీ కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మామూలోడు కాదని, గతంలో నకిలీ ఐడీ కార్డుతో ఎస్సైగా కూడా చలామణి అయ్యాడని, ఈ కేసులో విజయవాడ పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.