5 వేలకు పడిపోయిన తిరుమల భక్తుల సంఖ్య!
- తిరుమలపై లాక్ డౌన్ ప్రభావం
- రూ. 33 లక్షలకు తగ్గిన హుండీ ఆదాయం
- కొవిడ్-19 నిబంధనలను పాటిస్తున్నామన్న టీటీడీ
వైరస్,లాక్ డౌన్ ప్రభావం తిరుమలపై స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటివరకూ రోజుకు 8 వేల మంది వరకూ భక్తులు స్వామి దర్శనార్థం వస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఆ మేరకు హుండీ ఆదాయం కూడా పడిపోయిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన శనివారం నాడు తిరుమలలో రద్దీ ఎంతో అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
దానికి భిన్నంగా నిన్న కేవలం 5,090 మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. వారిలో 1,405 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ.33 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కొండపైకి వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నామని, కొవిడ్-19 నిబంధనలన్నీ పక్కాగా పాటిస్తున్నామని తెలియజేశారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు అమలవుతున్న కారణంగా స్థానిక భక్తులెవరూ తిరుమలకు రావడం లేదని అధికారులు వెల్లడించారు.