ఏపీలో కరోనా విజృంభణ.... భారీ స్థాయిలో కేసులు, మరణాల నమోదు!

  • రికార్డుస్థాయిలో 7,998 కొత్త కేసులు
  • 24 గంటల్లో 61 మంది మృతి
  • ఊరట కలిగించేలా ఒక్కరోజే 5 వేల మందికి పైగా డిశ్చార్జి
ఏపీలో కరోనా భూతం తీవ్ర రూపు దాల్చింది. జిల్లాల్లోనే వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కరోజే 7,998 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,391, గుంటూరు జిల్లాలో 1,184, అనంతపురం జిల్లాలో 1,016 కేసులను గుర్తించారు. దాంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 72,711కి చేరింది.

అటు, మరణాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 61 మంది మృత్యువాత పడ్డారు. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో 14 మంది చనిపోయారు. మొత్తమ్మీద రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 884కి పెరిగింది. ఇక, డిశ్చార్జి విషయంలో పురోగతి కనిపించడం కాస్త ఊరట అని చెప్పాలి. తాజాగా 5,428 మందిని డిశ్చార్జి చేయడం విశేషం. ఏపీలో ఇంకా 34,272 మంది చికిత్స పొందుతున్నారు.


More Telugu News