పుట్టిన రోజున... తన ప్రియుడికి షాకిచ్చిన గుత్తా జ్వాల
- హీరో విష్ణు విశాల్ తో ప్రేమలో ఉన్న గుత్తా జ్వాల
- ప్రియుడి పుట్టిన రోజున అతని ఇంటికి వెళ్లిన బ్యాడ్మింటన్ స్టార్
- త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న జంట
భారత క్రీడా ప్రపంచంలో గుత్తా జ్వాలది ఒక చరిత్ర. తాను సాధించిన విజయాలతోనే కాకుండా, వివాదాలతో సైతం ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉన్నారు. ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో ఆమెకున్న వైరం అందరికీ తెలిసిందే. నచ్చకపోతే ఎంత వరకు పోరాడేందుకైనా ఆమె వెనకడుగు వేయరు.
ఆమె వ్యక్తిగత విషయాలు వస్తే... ఆమె చేసుకున్న ఒక ప్రేమ పెళ్లి వ్యక్తిగత కారణాల వల్ల విఫలమైంది. తాజాగా హీరో విష్ణు విశాల్ తో ఆమె ప్రేమలో ఉంది. ఇద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు. విష్ణుతో జ్వాల సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా తన ప్రియుడు విష్ణుకు జ్వాల సర్ ప్రైజ్ ఇచ్చింది. విష్ణు పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని అతని ఇంటికి ఆమె నేరుగా వెళ్లింది. చెప్పకుండా ఇంటికి వచ్చిన తన ప్రియురాలుని చూసిన విష్ణు సర్ ప్రైజ్ అయ్యాడు. ఆ రోజంతా విష్ణు ఇంట్లోనే జ్వాల గడిపింది. కేక్ కట్ చేయించి, పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఆమెతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారు.