స్వీట్ మెమొరీ.. పెళ్లినాటి ఫొటోను పోస్ట్ చేసిన రాజశేఖర్
- 1991లో ప్రేమ వివాహం చేసుకున్న జీవిత, రాజశేఖర్
- పెళ్లి జరిగి నిన్నటికి 29 ఏళ్లు
- పెద్దలను ఒప్పించి పెళ్లాడిన జంట
టాలీవుడ్ లో జీవిత, రాజశేఖర్ లది ఒక అన్యోన్యమైన జంట. పలు చిత్రాల్లో కలసి నటించిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. జీవితాన్ని కలిసి పంచుకోవాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి తొలుత రాజశేఖర్ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కానీ, ఆ తర్వాత వారిని ఒప్పించారు. 1991 జులై 10న చెన్నైలో వీరు పెళ్లి చేసుకున్నారు. నిన్నటితో వీరి వివాహం జరిగి 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ పెళ్లినాటి ఫొటోను రాజశేఖర్ ట్విట్టర్ లో షేర్ చేశారు.