ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజు

  • నరసాపురం పరిధిలో రఘురామకృష్ణరాజుపై కేసులు
  • కేసులు కొట్టివేయాలంటూ పిటిషన్
  • ఎంపీకి, వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య కొనసాగుతున్న వార్
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం పరిధిలో తనపై నమోదవుతున్న కేసులను కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ లో కోరారు. రఘురామకృష్ణరాజు తమ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల మంత్రి శ్రీరంగనాథరాజు, వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తాజాగా, మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకటనాగేశ్వరావు, ముదునూరి ప్రసాద్ రాజు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదులు పెరిగిపోతుండడంతో రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు.


More Telugu News