తెలంగాణ హైకోర్టు మూతపడిందన్న వార్తలపై రిజిస్ట్రార్ జనరల్ స్పందన
- తెలంగాణ హైకోర్టులో కరోనా కలకలం
- మహమ్మారి బారిన పడిన 25 మంది సిబ్బంది
- కోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయన్న రిజిస్ట్రార్ జనరల్
తెలంగాణలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కరోనా మహమ్మారి హైకోర్టును సైతం తాకింది. ఇప్పటి వరకు 25 మంది హైకోర్టు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కోర్టు సిబ్బంది, సెక్యూరిటీకి కరోనా సోకుతోంది. నిన్న 50 మంది సిబ్బందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... వారిలో 10 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో హైకోర్టును శానిటైజ్ చేశారు. మరోవైపు హైకోర్టు మూతపడుతోందంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ వార్తలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఖండించారు. హైకోర్టు కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ జరుగుతుందని చెప్పారు. హైకోర్టుకు సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.