కొత్త పుస్తకం చదువుతున్న మహేశ్ బాబు!
- ఖాళీ దొరికితే బుక్స్ చదివే మహేశ్
- ప్రస్తుతం చదువుతున్న పుస్తకం 'ఎమోషనల్ ఇంటెలిజన్స్'
- ఈ వారం డానియల్ గోల్ మెన్ కే కేటాయిస్తున్నా
మహేశ్ బాబు మంచి చదువరి. ఖాళీ దొరికితే మంచి బుక్స్ చదువుతూ ఉంటాడు. స్నేహితులు సూచించే మంచి పుస్తకాలను తెప్పించుకుని చదువుతూ ఉంటాడు. తనకు నచ్చితే కనుక ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. 'మీరు కూడా చదవండి' అంటూ ప్రోత్సహిస్తూ ఉంటాడు కూడా.
ఇక గత కొన్నాళ్లుగా షూటింగులు లేక ఇంటివద్దే ఖాళీగా ఉంటున్న మహేశ్ పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. తాజాగా, పుస్తక ప్రపంచంలో ఎంతో పేరున్న డానియల్ గోల్ మేన్ రాసిన 'ఎమోషనల్ ఇంటెలిజన్స్' అనే పుస్తకాన్ని చదువుతున్నాడు. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 'ఎమోషనల్ ఇంటెలిజన్స్.. సైంటిఫిక్.. వినూత్నం.. అందరూ చదవాల్సిన పుస్తకం.. ఇక ఈ వారం అంతా డానియల్ గోల్ మెన్ కే కేటాయిస్తున్నా..' అంటూ మహేశ్ ఆ పుస్తకాన్ని చదువుతున్న విషయాన్ని అందంగా చెప్పాడు.