గుంటూరు బీటెక్ విద్యార్థిని అశ్లీల వీడియోల కేసులో మూడో వ్యక్తి గుర్తింపు!

  • బీటెక్ విద్యార్థినిపై బెదిరింపుల కేసులో పోలీసుల దర్యాప్తు
  • ఇప్పటికే ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
  • మరో వ్యక్తి కోసం గాలింపు
గుంటూరులో ఓ బీటెక్ విద్యార్థినికి కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారం చేసి వీడియోలుగా చిత్రీకరించిన వ్యవహారం తెలిసిందే. ఈ అశ్లీల వీడియోల సాయంతో ఆ విద్యార్థినిపై బెదిరింపులకు పాల్పడుతున్న ఏ1 వరుణ్, ఏ2 కౌశిక్ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

అయితే, బాధితురాలిని ఇన్ స్టాగ్రామ్ లో మరో వ్యక్తి కూడా బెదిరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితుడిని ఐపీ అడ్రెస్ ద్వారా గుర్తించేందుకు గుంటూరు పోలీసులు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వరుణ్, కౌశిక్ లతో ఈ మూడో వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాలి స్నేహితులను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.


More Telugu News