డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

  • ఇటీవల పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం
  • వీసీలు, రిజిస్ట్రార్లు, ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తాజా నిర్ణయం
  • డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్
ఇటీవల టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వారి చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సురేశ్ తెలిపారు.

పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. చివరి సెమిస్టర్ పరీక్షల రద్దు నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్, మార్కులపై నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


More Telugu News