దేశంలో కరోనా పరీక్షలు చేయడం తగ్గించాలంటూ ట్రంప్ అదేశాలు!
- ఎన్నికల ప్రచారం షురూ చేసిన ట్రంప్
- ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులు వస్తాయని వెల్లడి
- అందుకే తక్కువ పరీక్షలు చేయాలని చెప్పినట్టు వివరణ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం షురూ చేశారు. ఓక్లమాహాలోని టల్సాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా పరీక్షలు చేయడం తగ్గించాలని అధికారులను ఆదేశించానని తెలిపారు.
ఎక్కువ పరీక్షలు చేస్తేనే ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు వస్తాయని, తక్కువ పరీక్షలు చేస్తే తక్కువగానే కరోనా కేసులు వస్తాయని ట్రంప్ తనదైన శైలిలో భాష్యం చెప్పారు. కరోనా నిర్ధారణ పరీక్షలు అనే కత్తికి రెండు వైపులా పదును ఉందని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో దేశవ్యాప్తంగా విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించిన ట్రంప్... ఇప్పుడు తక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని చెప్పడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది.