హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగానికి ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్న ఎఫ్‌డీఏ

  • ఈ ఔషధం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ
  • కరోనా చికిత్సలో ఇది సమర్థంగా పనిచేసే అవకాశం లేదు
  • భారత్ నుంచి గతంలో పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్న అమెరికా
కరోనా చికిత్సలో  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగించవచ్చంటూ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) గతంలో ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంది. ఈ ఔషధాన్ని వాడడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని భావించిన ఎఫ్‌డీఏ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్థంగా పనిచేసే అవకాశం లేదని ఈ సందర్భంగా పేర్కొంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని మలేరియా చికిత్సలో వాడతారు. కరోనా చికిత్సకు తొలినాళ్లలో అమెరికాలో ఈ మందును ఉపయోగించారు.

వైరస్‌ను అడ్డుకోవడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తోందని అప్పట్లో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు జాగ్రత్త చర్యగా స్వయంగా ఈ మందులను కొంతకాలం పాటు వేసుకున్నారు. అంతేకాదు, భారత్ నుంచి పెద్దమొత్తంలో వీటిని దిగుమతి చేసుకున్నారు కూడా. కాగా, ఎఫ్‌డీఏ తాజా నిర్ణయంతో ఇప్పటికే సేకరించిన ఈ ఔషధాన్ని ఇప్పుడు పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది.


More Telugu News