కశ్మీర్లో పత్రికా స్వేచ్ఛను అణచివేయడం అత్యంత దురదృష్టకరం: నగ్మా

  • కశ్మీర్ లో మీడియాపై అణచివేత దారుణమని ట్వీట్
  • నయా కశ్మీర్ ఉండాల్సింది ఇలా కాదంటూ హితవు
  • మీడియా పాలసీ పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్య 
అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జమ్మూ కశ్మీర్ వ్యవహారాల ఇన్ చార్జి, ప్రముఖ సినీ నటి నగ్మా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో మీడియా హక్కుల హననం జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ పాలకులు జమ్మూ కశ్మీర్ లో పూర్తిగా మీడియా గొంతుక నొక్కేస్తున్నారని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇది దారుణం అని, అత్యంత దురదృష్టకర పరిణామం అని పేర్కొన్నారు.

మీడియా పట్ల ప్రభుత్వాల వైఖరి అనైతికం అని, నయా కశ్మీర్ ఉండాల్సింది ఇలా కాదని, ఎంతో పారదర్శకంగా ఉండాలని, అణచివేతలకు స్వస్తి పలకాలని నగ్మా ట్విట్టర్ లో హితవు పలికారు. జమ్మూ కశ్మీర్ సర్కారు సరికొత్త మీడియా పాలసీపై ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా నగ్మా ట్వీట్ చేశారు.


More Telugu News