ఒంగోలు సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు

  • ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఝార్ఖండ్‌లో భూ ప్రకంపనలు 
  • భయంతో ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు 
  • ఒంగోలు శర్మ కళాశాల, అంబేద్కర్‌ భవన్‌ పరిసరాల్లో భూప్రకంపనలు 
ఒంగోలు సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఝార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శర్మ కళాశాల, అంబేద్కర్‌ భవన్‌ పరిసరాల్లో స్వల్ప భూప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చారు.

ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఝార్ఖండ్‌లో రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 4.7గా నమోదయిందని అధికారులు మీడియాకు తెలిపారు. కర్ణాటకలోని హంపిలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4గా నమోదయిందని అన్నారు.


More Telugu News