ఎన్టీఆర్ అభిమానులపై నటి మీరా చోప్రా కేసు.. ఢిల్లీకి బదిలీ చేసిన హైదరాబాద్ పోలీసులు!

  • తనకు ఎన్టీఆర్ కంటే మహేశ్ బాబు అంటేనే ఇష్టమన్న మీరా చోప్రా
  • దుమ్మెత్తి పోస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్ అభిమానులు
  • ఎనిమిది ట్విట్టర్ ఖాతాల నుంచి అసభ్యకర సందేశాలు వచ్చినట్టు గుర్తింపు
సినీ నటి మీరా చోప్రాపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు ఢిల్లీకి బదిలీ అయింది. మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. ఇటీవల ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న మీరా చోప్రా తనకు ఎన్టీఆర్ కంటే మహేశ్‌బాబు అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ట్విట్టర్ వేదికగా ఆమెను దుమ్మెత్తిపోయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీంతో స్పందించిన నటి ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది ఖాతాల నుంచే ఆమెకు అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. కాగా, నటి ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా, ‘67ఎ’ను కూడా జతచేశారు. మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు చెప్పారు.


More Telugu News