నన్ను ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటున్నారు?: అభిమానులను అడిగిన రష్మిక
- భారీ హిట్లతో క్రేజ్ పెంచుకుంటున్న కన్నడ భామ
- ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందంటూ ట్వీట్
- సూచనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడి
ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న లాక్ డౌన్ రోజుల్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఈ నేపథ్యంలో, ఇవాళ అభిమానులను ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది.
భవిష్యత్తులో తనను ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించింది. ఎలాంటి సినిమాలు చేస్తే మీకు నచ్చుతుంది? అంటూ అభిమానుల నుంచి జవాబులు కోరింది. అభిమానులిచ్చే, సలహాలు, సూచనల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది.