హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా గుడ్‌న్యూస్!

  • రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రీమియం వీసా ప్రక్రియ
  • రెండు వారాల్లోనే తెలిసిపోనున్న స్టేటస్
  • లక్షలాది దరఖాస్తులు వస్తాయని అంచనా
హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా శుభవార్త చెప్పింది. దాదాపు రెండు నెలల తర్వాత రేపు (సోమవారం) ప్రీమియం విధానాన్ని ప్రారంభించనున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించడం ఆశావహుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ విధానంలో కేవలం రెండు వారాల్లోనే దరఖాస్తు ఆమోదం పొందినదీ, లేనిదీ తెలిసిపోతుంది. ప్రీమియం వీసా ప్రక్రియ ప్రారంభం కాగానే లక్షలాది దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఈ ఏడాది మార్చి 20లోపు వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఐ-129, ఐ-140 ఆమోదం కోసం మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, గతంలో దరఖాస్తు చేసుకోని వారికి మాత్రం ఎలాంటి అవకాశం ఉండదు.  నిజానికి అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న వారు గడువు ముగిసిన రెండు నెలల్లోపు అమెరికాను విడిచిపెట్టాల్సి ఉంటుంది.  


More Telugu News