టిక్‌టాక్ చూడొద్దన్న తల్లి.. ఆత్మహత్య చేసుకున్న బాలిక

  • టిక్‌టాక్‌కు బానిసైన కుమార్తె
  • తల్లి కోప్పడడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న బాలిక
  • హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఘటన
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. టిక్‌టాక్ చూడొద్దని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన టీనేజ్ అమ్మాయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాంతపూర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామాంతపూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక టిక్‌టాక్‌కు బానిసైంది. అలాగే, అదేపనిగా సెల్‌లో గేమ్స్ ఆడేది. గమనించిన తల్లి అస్తమానం టిక్‌టాక్ ఏంటని కోప్పడింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.


More Telugu News