పెళ్లి చేసుకుంటానని సంబంధం పెట్టుకుంటే అత్యాచారం అనలేం: ఒడిశా హైకోర్టు కీలక రూలింగ్!

  • హైకోర్టు ముందుకు వచ్చిన కేసు
  • పెళ్లికి నిరాకరిస్తే రేప్ కేసు పెడుతున్నారు
  • తీర్పిచ్చిన జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి
పెళ్లి చేసుకుంటానన్న ప్రలోభాలతో నడిపే వివాహేతర బంధాన్ని అత్యాచారంగా పరిగణించరాదని ఒడిశా హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటారని భావించిన కొందరు యువతులు, శారీరకంగా కలుస్తున్నారు. ఆ తరువాత పెళ్లికి నిరాకరించిన పక్షంలో అత్యాచారం చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. వాటిని రేప్ కేసులుగా భావించలేం అని హైకోర్టు జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో భాగంగా, ఓ యువకుడు తనతో శారీరక సంబంధం పెట్టుకుని, పెళ్లికి నిరాకరించాడని యువతి కేసు పెట్టింది. విచారణ తరువాత యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ హైకోర్టుకు రాగా, నిందితుడికి బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టుగా న్యాయమూర్తి తెలిపారు.


More Telugu News