నాగబాబు వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు సంబంధం లేదు: పవన్ కల్యాణ్
- సోషల్ మీడియాలో నాగబాబు కామెంట్స్
- నాగబాబు వ్యాఖ్యలపై విమర్శలు
- అవి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనన్న పవన్
జనసేన పార్టీలో లక్షల సంఖ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవని, వాటితో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల మెగాబ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై విమర్శలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ స్పందించారు.
కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని, వాటిని కూడా పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నామని పవన్ వెల్లడించారు. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీపరమైన నిర్ణయాలు, అభిప్రాయాలను జనసేన అధికారిక పత్రం ద్వారా, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా జనసైనికులందరికీ పవన్ విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్న సమయంలో, ప్రజాసేవ తప్ప మరో అంశం జోలికి వెళ్లవద్దని కోరుతున్నట్టు స్పష్టం చేశారు. ఎవరూ క్రమశిక్షణను అతిక్రమించవద్దంటూ హితవు పలికారు. ఇటీవల నాగబాబు... గాంధీ, గాడ్సే వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.