ఈ వీడియో చూసి షాక్‌ అయ్యాను!: చంద్రబాబు ట్వీట్

  • విజయనగరంలో చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత
  • అశోక్ గజపతి రాజు కుటుంబ ప్రాభవాన్ని తగ్గించడానికే
  • ఇటువంటి నీచ రాజకీయాలు చేయొద్దు
విజయనగరంలో చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడాన్ని చూసి షాకయ్యానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. అశోక్ గజపతి రాజు కుటుంబం ఆ ప్రాంతానికి చేసిన సేవలకు సంబంధించి ఆనవాళ్లను ఉద్దేశపూర్వకంగా తుడిచేయడానికి జగన్‌ పాల్పడుతున్న చర్యల్లో ఇదొకటని చంద్రబాబు విమర్శించారు.

ఇటువంటి నీచ రాజకీయాలు చరిత్రలో ఎన్నడూ విజయం సాధించలేదని చంద్రబాబు హితవు పలికారు. కాగా, రాజుల కాలం నాటి మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేసిన స్థలంలో కొత్త చిహ్నాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.



More Telugu News