నాన్నతో నా చివరి ఫొటో ఇదే... అంటూ ప్రియాంక గాంధీ భావోద్వేగభరిత పోస్టు
- ఇవాళ రాజీవ్ గాంధీ వర్థంతి
- తండ్రితో కలిసున్న ఫొటో పోస్టు చేసిన ప్రియాంక
- ఓ సందేశాన్ని కూడా వెలువరించిన కాంగ్రెస్ అగ్రనేత
ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. తాజాగా, రాజీవ్ గాంధీ తనయ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తండ్రితో తాను కలిసున్న ఓ పాత ఫొటోను పంచుకున్నారు. నాన్నతో నా చివరి ఫొటో అంటూ ఆమె భావోద్వేగభరిత పోస్టు చేశారు. అంతేకాదు ఓ సందేశాన్ని కూడా వెలువరించారు.
"మీ పట్ల నిర్దయగా వ్యవహరించేవారితోనూ దయగా మెలగండి. జీవితం ఎంత అన్యాయమైనదని మీరు ఊహించుకోవచ్చు గాక, కానీ అది అందమైనదని తెలుసుకోండి. ఆకాశం చిమ్మచీకటిగా మారినా, భీకర తుపాను వణికిస్తున్నా నడుస్తూనే ఉండండి. ఓ గొప్ప హృదయాన్ని పెంపొందించుకోవాలంటే, ఎన్ని దుఃఖాలు ఉన్నా ఆ గుండెను ప్రేమతో నింపండి. నా తండ్రి జీవితం నుంచి నేను పొందిన కానుకలు ఇవే" అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.