సీఎం జగన్ కీలక నిర్ణయం... ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం!

  • లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోతలు!
  • పూర్తి వేతనాలు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
  • ఫైనాన్స్, ట్రెజరీ విభాగాలకు ఆదేశాలు
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దాంతో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఏపీలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే, ఇకమీదట ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోత ఉండదని ఏపీ సర్కారు పేర్కొంది.

దీనికి సంబంధించి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. మే నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ, ట్రెజరీ విభాగాలకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించేందుకు వీలుగా ట్రెజరీకి చెందిన సాఫ్ట్ వేర్ లోనూ మార్పులు, చేర్పులు చేయనున్నారు. కాగా, గత రెండు నెలల్లో తగ్గించిన వేతనాల బకాయిల చెల్లింపుపై కూడా సీఎం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 


More Telugu News