మీడియా ముందు సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరించి వేడుకున్న నిర్మలా సీతారామన్!
- ప్రతిపక్ష పార్టీలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను
- వలస కార్మికుల అంశంపై అందరం కలిసి పనిచేయాలి
- ఈ సమస్యపై మేము అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాం
- సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ విషయం చెబుతున్నాను
లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల పరిస్థితులపై రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. 'ప్రతిపక్ష పార్టీలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నారు. వలస కార్మికుల అంశంపై అందరం కలిసి పనిచేయాలి. ఈ సమస్యపై మేము అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాం. సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తూ నేను ఒకటి చెబుతున్నాను. వలసకార్మికులపై మరింత బాధ్యతగా మాట్లాడాలి, వారి సమస్యలను పరిష్కరించాలి' అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మీడియా ముందు చేతులు ఎత్తి నమస్కరించారు. వలస కార్మికుల విషయంలో రాజకీయాలు చేయడం తగదని ఆమె అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో నిజాయతీగా వ్యవహరించాల్సింది పోయి, ఈ విషయంపై రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా నాటకాలు మానుకోవాలని ఆమె సూచించారు.