ఏపీలో దుకాణాలు తెరిచేందుకు మార్గదర్శకాల జారీ

  • కంటోన్మెంట్ జోన్లు మినహా  షాపులు తెరవచ్చు
  • ఉదయం 10  నుంచి సాయంత్రం 5 గంటల వరకు 
  • పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్ల విక్రయం ఉదయం 6  నుంచి 11 గంటల వరకే
ఏపీలో కంటోన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్లలో షాపులు తెరుచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇవాళ మార్గదర్శకాలు జారీ చేసింది.   ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చని, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లను మాత్రం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరవాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఈ మార్గదర్శకాలను అనుసరించి గ్రామాల్లో షాపులు, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న షాపులతో పాటు, అతి తక్కువ పాజిటివ్ కేసులు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో నిత్యావసర దుకాణాలు తెరిచేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలను వినియోగదారులు, కొనుగోలుదారులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజికదూరం పాటించాలని, దుకాణాల వద్ద శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.


More Telugu News