‘ఆరోగ్య సేతు’ తప్పనిసరిగా వాడాలని కేంద్రం చెప్పడం చట్టవిరుద్ధం: జస్టిస్ శ్రీకృష్ణ

  • ‘ఆరోగ్య సేతు’ను తప్పనిసరిగా వాడాలన్న కేంద్రం
  • చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఈ యాప్ ను తప్పనిసరి చేస్తున్నారు?
  • ఇప్పటి వరకూ ఏ చట్టమూ ఈ యాప్ ను సమర్థించట్లేదు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి  ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా తమ మొబైల్స్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ లేకుండా ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం తరచుగా ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటనలపై సుప్రీంకోర్టు మాజీ జడ్డి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ స్పందించారు.

ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వాడాలని కేంద్రం చెప్పడం చట్టవిరుద్ధమని అన్నారు. చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఈ యాప్ ను తప్పనిసరి చేస్తున్నారు? అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఏ చట్టమూ ఈ యాప్ ను సమర్థించట్లేదని స్పష్టం చేశారు. మొబైల్స్ లో ఈ యాప్ లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000 వరకు జరిమానా విధిస్తామని నోయిడా పోలీసులు ఆదేశించారని, ఇది చట్ట వ్యతిరేకం అని, ఇలాంటి ఆదేశాలను కోర్టుల్లో సవాలు చెయ్యవచ్చని అన్నారు.


More Telugu News