ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచడం జగన్ అసమర్ధతకు నిదర్శనం: బోండా ఉమ

  • లాక్ డౌన్ తో  కష్టాల్లో ఉన్న ప్రజలపై భారం మోపుతారా?
  • పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి
  • లేకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తాం
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పెంచిన విద్యుత్ బిల్లులను చెల్లించవద్దని టీడీపీ పిలుపు నిచ్చింది. ప్రభుత్వం తక్షణం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు పెంచడం సీఎం జగన్ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను చంద్రబాబు పెంచలేదని అన్నారు. లాక్ డౌన్ తో పనులు లేక కష్టాల్లో ఉన్న ప్రజలపై భారం మోపుతారా? అని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ బిల్లులను రద్దు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.


More Telugu News