ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అచ్చెన్నాయుడి నేతృత్వంలో కమిటీయా... క్యా బాత్ హై!: విజయసాయిరెడ్డి వ్యంగ్యం
- వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై మాటల యుద్ధం
- ఐఏఎస్ కమిటీ నియామకాన్ని ప్రశ్నించిన చంద్రబాబు
- టీడీపీ తరఫున అచ్చెన్న ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ప్రకటన
- స్పందించిన విజయసాయిరెడ్డి
వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ ల కమిటీలో నిపుణులు లేరని, శాస్త్రీయపరమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అనడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఐఏఎస్ ల కమిటీలో నిపుణులు లేరన్న బాబు... ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అచ్చెన్నాయుడి నేతృత్వంలో కమిటీ వేయటమా... క్యా బాత్ హై! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ఐఏఎస్ లతో కమిటీ నియమించిందని, వాళ్లకు శాస్త్రపరమైన విషయాలు ఎలా తెలుస్తాయని అన్నారు. ఈ విషయంలో తాము అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్పలతో త్రిసభ్య కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు.