ఆ పాత్రను ఒప్పుకుని పొరపాటు చేశాను: యాంకర్ రష్మీ

  • బుల్లితెరపై రష్మీ జోరు
  •  వెండితెరపై  మెరిసిన తీరు
  • నిరాశ ఎదురైందన్న రష్మీ    
ఇటు బుల్లితెరపై యాంకర్ గా .. అటు వెండితెరపై కథానాయికగా రష్మీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది.  కొంతకాలంగా సినిమాల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చిన ఆమె, బుల్లితెరపై మాత్రం తన జోరు చూపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో రష్మీ మాట్లాడుతూ ..  "బుల్లితెరపై నాకున్న క్రేజ్ వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టింది. దాంతో ఒక్కో సినిమా చేస్తూ వెళ్లాను.

ఈ క్రమంలోనే 'గుంటూరు టాకీస్' సినిమా చేశాను. ఆ సినిమాలో నేను సెక్సీగా .. గ్లామర్ డోస్ పెంచేస్తూ కనిపించడం చూసి అభిమానులు షాక్ అయ్యారు.  ఆ సినిమా తరువాత నుంచి నాకు అదే తరహా పాత్రలు రావడం మొదలుపెట్టాయి. దాంతో ఒకే కేటగిరికి సంబంధించిన పాత్రలను చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.  వైవిధ్యభరితమైన పాత్రలను చేయాలనే నా ఆశ నిరాశ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాత్రను ఒప్పుకుని చాలా పొరపాటు చేశాననే  చెప్పాలి. ఇకపై అలాంటి పాత్రలను ఎలాంటి పరిస్థితుల్లోను ఒప్పుకోను" అని చెప్పుకొచ్చింది.


More Telugu News