మహారాష్ట్రను బెంబేలెత్తిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1200కుపైగా కేసులు
- రాష్ట్రంలో 16,758కి పెరిగిన మొత్తం కేసులు
- ఒక్క ముంబైలోనే 769 కేసుల నమోదు
- ధారావిని వీడని మహమ్మారి
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే అక్కడ అత్యధికంగా 1, 233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,758కి పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో 34 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 651 చేరుకుంది. మరోవైపు, కరోనాకు కేంద్ర బిందువుగా మారిన ముంబైలో కేసుల సంఖ్య 10 వేలు దాటింది.
ఇక్కడ ఒక్క రోజే 769 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా ఒక్క ముంబైలోనే కరోనా బాధితుల సంఖ్య 10,527కి చేరింది. అలాగే, నగరంలో నిన్న 25 మంది కరోనా కాటుకు ప్రాణాలొదిలారు. దీంతో ఇక్కడ మృతుల సంఖ్య 412కి చేరింది. రాష్ట్రంలోని మొత్తం మరణాల్లో దాదాపు 65 శాతం ఇక్కడే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మురికివాడ ధారావిలోనూ కరోనా చెలరేగుతోంది. ఇక్కడ కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ నమోదైన మొత్తం కేసులు 733కి పెరిగాయి. నిన్న ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 21కి చేరింది.