మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా?: చంద్రబాబునాయుడు
- ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
- రైతు తన పంటను అమ్ముకునే పరిస్థితులు లేవు
- కడపలో రైతులు కూరగాయలను నడిరోడ్డుపై పారబోశారు
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోందని మండిపడ్డారు. కడపజిల్లా, గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోయడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. పండించిన కూరగాయలను బస్తాల్లో తీసుకొచ్చిన రైతులు వాటిని రోడ్డుపై పారపోస్తూ తమ నిరసన తెలిపారు. బ్రాందీ షాపులకు ఉన్న విలువ రైతులకు లేదా? అంటూ ప్రభుత్వాన్ని ఓ రైతు ప్రశ్నించడం ఈ వీడియోలో ఉంది.