నాన్నా... మళ్లీ మనం కలుసుకునేంత వరకు...: రిషి కపూర్ కుమార్తె భావోద్వేగం

  • నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా
  • ప్రతి రోజు నిన్ను మిస్ అవుతూనే ఉంటా
  • నీ వీడియో కాల్స్ మిస్ అవుతా
తన తండ్రి రిషి కపూర్ చివరి చూపు కోసం ఆయన కుమార్తె రిద్ధిమా కపూర్ ఢిల్లీ నుంచి ముంబైకి రోడ్డు మార్గంలో వస్తున్నారు. సాయంత్రం జరిగే అంత్యక్రియల సమయానికి ఆమె ముంబై చేరుకోనున్నారు. మరోవైపు తన తండ్రి మరణవార్తతో ఆమె తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రిని ఉద్దేశిస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా హృదయాలను కదిలించే పోస్ట్ చేశారు.

'నాన్నా... ఐలవ్యూ. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. రిప్... మై స్ట్రాంగెస్ట్ వారియర్. ప్రతి రోజు నిన్ను మిస్ అవుతూనే ఉంటా. ప్రతిరోజు నీ వీడియో కాల్స్ మిస్ అవుతా. మళ్లీ నిన్ను కలుసుకునేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా నాన్నా' అని రిద్ధిమా తన మనసులోని ఆవేదనను వ్యక్తపరిచారు.


More Telugu News