ఈ పరిస్థితుల్లో డిఫెన్స్ ఆడడమే మేలు: సచిన్ కు బదులిచ్చిన చిరంజీవి
- బర్త్ డే విషెస్ చెప్పిన చిరూకి సచిన్ థ్యాంక్స్
- సర్వేజనా సుఖినోభవంతు అంటూ మెగాస్టార్ రిప్లయ్
- ఆత్మరక్షణే ఎదురుదాడిగా భావించాలంటూ ట్వీట్
ఇటీవల క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జన్మదినం సందర్భంగా టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిపై సచిన్ స్పందిస్తూ, చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా సచిన్ ట్వీట్ కు చిరంజీవి బదులిచ్చారు. "థాంక్యూ సచిన్ బ్రదర్, ఆల్ ఈజ్ వెల్.. ఇప్పటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో డిఫెన్స్ ఆడడమే సరైన విధానం. ఆత్మరక్షణ పాటించడాన్నే ఇప్పుడు ఎదురుదాడిగా భావించాలి. నేను అందరికీ ఇదే విషయం చెబుతున్నాను" అంటూ ట్వీట్ చేశారు.