కర్నూలు జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి... బైరెడ్డి నాకు లేఖ రాశారు: పవన్ కల్యాణ్

  • కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందన్న పవన్
  • ప్రభుత్వాన్ని తప్పుబట్టడంలేదని వెల్లడి
  • చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరిక
కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అయితే తాను ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం లేదని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు. "రాయలసీమ అభ్యున్నతి కోసం అహరహం శ్రమించే నిజమైన నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాకు లేఖ రాశారు. కరోనా మహమ్మారి విస్తరణపై తన ఆందోళనను వెలిబుచ్చారు. కరోనా నివారణ చర్యల్లో రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు విఫలమవడాన్ని ఆయన ప్రస్తావించారు" అని పవన్ ట్విట్టర్ లో తెలిపారు.


More Telugu News