నేడు సచిన్ బర్త్ డే.. లాక్ డౌన్ అనుభవాలను పంచుకున్న మాస్టర్ బ్లాస్టర్
- వంట పని, ఇంటి పని కూడా చేస్తున్నా
- పిల్లలతో గడిపేందుకు లాక్ డౌన్ సమయాన్ని కల్పించింది
- అమ్మతో కూడా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నా
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 47వ జన్మదినం నేడు. అయితే లాక్ డౌన్ సందర్భంగా పుట్టినరోజును తన కుటుంబసభ్యుల మధ్య ఇంట్లోనే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా లాక్ డౌన్ అనుభవాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు.
'లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లోనే గడుపుతున్నా. వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పట్టడం వంటి పనులు చేస్తున్నా. పిల్లలు సారా, అర్జున్ తో గడిపేందుకు లాక్ డౌన్ కావాల్సినంత సమయాన్ని కల్పించింది. పిల్లలిద్దరి వయసు 20 ఏళ్లు దాటింది. సాయంత్ర సమయాల్లో ఇంట్లోనే గడపడం వారికి చాలా కష్టంగా ఉంది. స్నేహితులతో గడపడంతో పాటు వారి సొంత పనులు వారికి ఉంటాయి. ఏదేమైనప్పటికీ నేను, నా భార్య అంజలి పిల్లలతో గడిపే అవకాశాన్ని లాక్ డౌన్ కల్పించింది. ఇదే విధంగా అమ్మతో కూడా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నా' అని సచిన్ తెలిపాడు.