బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరూ!

  • కొరటాలతో సెట్స్ పై 'ఆచార్య'
  • తదుపరి ప్రాజెక్టుగా 'లూసిఫర్' రీమేక్
  • బాబీ వినిపించిన కథ పట్ల చిరూ సంతృప్తి
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత సినిమాను సుజీత్ దర్శకత్వంలో చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్' కి ఇది రీమేక్. సొంత బ్యానర్లో ఈ సినిమాను చరణ్ నిర్మించనున్నాడు. అందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.

ఇక ఈ సినిమా తరువాత పాజెక్టు కోసం దర్శకుడు బాబీ .. మెహర్ రమేశ్ పోటీపడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లలో బాబీకి చిరంజీవి ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఈ మధ్య 'వెంకీమామ'తో బాబీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల బాబీ కథ వినిపించగా, కథలోని కొత్తదనం పట్ల సంతృప్తి చెందిన చిరంజీవి ఆయనకి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.


More Telugu News