కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్
- స్వయంగా వెల్లడించిన మంత్రిత్వ శాఖ
- ఆ వ్యక్తికి అండగా ఉంటామని హామీ
- ఈ నెల 15న కార్యాలయానికి వచ్చిన బాధితుడు
భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉద్యోగికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆ మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. సదరు ఉద్యోగికి నిన్న నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలినట్టు ట్వీట్ చేసింది. ఆ వ్యక్తి ఈ నెల 15వ తేదీన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి హాజరైనట్టు తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాధితుడితో కాంటాక్ట్ అయిన ఇతర ఉద్యోగులందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లాలని ఆదేశించింది. అలాగే, కార్యాలయంలో తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పింది.
కరోనా బాధితుడికి అండగా ఉంటామని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి హామీ ఇచ్చారు. అతనికి వైద్యం సహా అన్ని రకాల సహాయం అందిస్తామని చెప్పారు. సదరు ఉద్యోగి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.
కరోనా బాధితుడికి అండగా ఉంటామని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి హామీ ఇచ్చారు. అతనికి వైద్యం సహా అన్ని రకాల సహాయం అందిస్తామని చెప్పారు. సదరు ఉద్యోగి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.