డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ

  • పూర్తి యాక్షన్ హీరోగా విజయ్ దేవరకొండ
  • డిఫరెంట్ గా డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్
  • కథానాయికగా అనన్య పాండే పరిచయం
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. దాంతో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉంటుంది? ఆయన ఎలా కనిపిస్తాడు? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమాలో ఆయన ఓ మాఫియా డాన్ కి కొడుకుగా కనిపిస్తాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొంతసేపు అలా కనిపించే ఆయన, ఆ తరువాత మాఫియాకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడని అంటున్నారు. మాఫియా ముఠాకి .. కథానాయకుడికి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలే ఈ సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు. విజయ్ దేవరకొండపై డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్, ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేసేలా వుంటాయని అంటున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా 'అనన్య పాండే' పరిచయమవుతోంది.


More Telugu News