వరంగల్ జిల్లాలో ఘోరం... పెన్షన్ తీసుకుని వస్తున్న వృద్ధ దంపతులను బలిగొన్న కారు
- రోడ్డు దాటుతున్న దంపతులను ఢీకొట్టిన షివర్లే కారు
- అక్కడికక్కడే మరణించిన వృద్ధులు
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లి వస్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో ఆ వృద్ధ దంపతులు అక్కడికక్కడే మరణించారు. వారిని నాయిని ఎల్లయ్య (58), నాయిని వెంకటలక్ష్మి (52) గా గుర్తించారు. ఎల్లయ్య దివ్యాంగుడు.
కాగా, ఎల్లయ్య, వెంకటలక్ష్మి ధర్మాసాగర్ పరిధిలోని రాంపూర్ వాసులు. పెన్షన్ తీసుకున్న తర్వాత రోడ్డు దాటుతుండగా, దూసుకువచ్చిన షివర్లే కారు వారిని ఢీకొట్టిందని, తాము ఈ ఘటనను సీసీ టీవీ ఫుటేజి ద్వారా తెలుసుకోగలిగామని ధర్మాసాగర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మహ్మద్ తెలిపారు. యాక్సిడెంట్ అనంతరం కారు ఆగకుండా వెళ్లిపోయిందని, ఆ కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతోందని వెల్లడించారు. నిర్లక్ష్యంగా కారు నడిపి మరణానికి కారణమయ్యారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.