పని లేదు, ఆర్థికంగా దెబ్బతిన్నాం.. జీవితం మారిపోయింది: వాపోయిన హీరోయిన్ పాయల్ ఘోష్

  • ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు
  • ఎవరి జీవితమూ పూల పాన్పులా లేదు
  • పరిస్థితి అనుకూలంగా లేదన్న 'ప్రయాణం' హీరోయిన్
ఇండియాలో కరోనా కట్టడికి లాక్ డౌన్ ను మరో 19 రోజుల పాటు పొడిగించడంతో, అప్పటికే 21 రోజుల పాటు ఇంట్లో ఉండిపోయిన కోట్లాది మంది, మరిన్ని రోజులు పనిలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీ కూలీల నుంచి పరిశ్రమల్లో పని చేసేవారి వరకూ ఎవరికీ పని లేకుండా పోయింది. సినీ పరిశ్రమలోని కార్మికులు, చిన్న చిన్న పాత్రలు చేసుకుని పొట్ట గడుపుకుంటున్న నటీ నటుల పరిస్థితీ అలానే ఉంది.

ఇక, లాక్ డౌన్ కారణంగా తనకు పని లేకుండా పోయిందని, ఆర్థికంగా చితికి పోతున్నానని, ఇటువంటి జీవితం వస్తుందని గతంలో ఎన్నడూ ఊహించుకోలేదని 'ఊసరవెల్లి', 'ప్రయాణం' తదితర చిత్రాల్లో నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్ వాపోయింది. ప్రస్తుతం ఎవరి జీవితమూ పూల పాన్పులా లేదని, పరిస్థితులు అనుకూలించడం లేదని, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.

ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, ఇళ్లలోనే ఉండి, ప్రాణాలు కాపాడుకోవాలని, ప్రజలంతా బాధ్యతగా ఉంటూ, కలసి పోరాడాల్సిన సమయం ఇదని సలహా ఇచ్చింది. కాగా, 2008లో ఆంగ్ల చిత్రం 'షార్పీస్ పెరిల్'తో పరిచయమైన పాయల్, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాకుండా, కీలక పాత్రలను కూడా పోషించి మెప్పించింది.


More Telugu News